‘కింగ్డమ్’ ఈ వెర్షన్ డైరెక్ట్ గా ఓటిటిలో.. ఇందుకేనా?

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ చిత్రమే “కింగ్డమ్”. మరి ఎన్నో అంచనాలు అందుకున్న ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడు ఉంటుందా అని ఎదురు చూస్తున్న సమయంలో ఎట్టకేలకి ఈ సినిమా ఈ జూలై 31కి లాక్ అయ్యింది.

అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఈ అనౌన్సమెంట్ తో హిందీ వెర్షన్ పై ఊహించని ట్విస్ట్ వచ్చింది. కింగ్డమ్ కేవలం, తెలుగు, తమిళ్ లో మాత్రమే థియేటర్స్ లో హిందీ వెర్షన్ ని డైరెక్ట్ గా ఓటిటికే వదిలేసారు. అయితే దీనికి కారణం వినిపిస్తుంది. మొదట థియేట్రికల్ గా హిందీలో అనౌన్స్ చేసినప్పటికీ మధ్యలో జరిగిన ఆలస్యం, వాటితో పాటుగా నెట్ ఫ్లిక్స్ తో జరిగిన చర్చలు మూలం గానే ఈ టర్న్ తీసుకోవాల్సి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇలా కింగ్డమ్ హిందీ వెర్షన్ మాత్రం డైరెక్ట్ ఓటిటిలోకే వస్తుందని చెప్పవచ్చు.

Exit mobile version