సెన్సేషనల్ స్టార్ ది విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రమే “కింగ్డమ్”. విజయ్ ని సరికొత్తగా ఆవిష్కరించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ని ఎట్టకేలకి ఈ జూలై ఆఖరులో విడుదలకి సిద్ధం చేశారు. అయితే దీనిపై విడుదల చేసిన నిమిషం లేని కూడా ఓ ప్రోమో కట్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది అని చెప్పవచ్చు.
క్రేజీ యాక్షన్ ఎలిమెంట్స్, విజయ్ దేవరకొండలో కొన్ని షేడ్స్ లో చూపించిన విజువల్స్ కానీ గౌతమ్ టేకింగ్, అనిరుద్ స్కోర్ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ ట్రీట్ ని ప్రామిస్ చేస్తున్నాయి. దీనితో ఇది చూసాల చూసాక మాత్రం ఇన్ని రోజులు ఆలస్యం అయ్యినా కూడా థియేటర్స్ లో బ్లాస్టింగ్ ట్రీట్ ఖాయం అనేట్టుగా ఈ సింగిల్ ప్రోమోతో కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఇక ఈ జూలై 31న థియేటర్స్ లో వచ్చే సినిమా ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి.