టాలీవుడ్‌లో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారంటూ పలువురు యాక్టర్స్‌కు ఈడీ గతంలో నోటీసులు జారీ చేసింది. వారు ప్రమోట్ చేసిన యాప్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించడంతో పాటు, ఈడీ అధికారులు ప్రశ్నించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ వారికి ఆయా నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, తాజాగా బుధవారం(ఆగస్టు 6) నాడు ఈడీ విచారణకు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హాజరయ్యాడు.
ఇక ఈడీ అధికారులు ఆయన్ను చాలా సేపు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, ఈడీ విచారణ తర్వాత బయటకు వచ్చిన విజయ్ మీడియాకు వివరణ ఇచ్చాడు. తాను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్స్ కాదని.. గేమింగ్ యాప్స్ అని.. గేమింగ్ యాప్స్ మన దేశంలో లీగల్ అని.. వాటికి జీఎస్టీ ఉంటుంది.. అవి మన దేశంలోని క్రికెట్, ఒలింపిక్స్, ఇతర క్రీడలకు స్పాన్సర్స్ చేస్తున్నాయని.. కానీ బెట్టింగ్ యాప్ విషయంలో తన పేరు ఎందుకు వచ్చిందని అధికారులు అడగడంతో వాటికి సమాధానంగా కొన్ని డాక్యుమెంట్స్ సమర్పించానని విజయ్ తెలిపాడు.
ఈ వ్యవహారం ఇక్కడితో సమాప్తం అంటూ విజయ్ చెప్పడం కొసమెరుపు. ఇక ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో విజయ్‌కు ఈడీ క్లీన్ చిట్ ఇస్తుందా అనేది చూడాలి.