హీరోగా మారనున్న సంగీత దర్శకుడు


తెలుగు పరిశ్రమలో డాన్స్ మాస్టర్స్,హాస్యనటులు మరియు గాయకులూ ఇప్పటి వరకు కథానాయకులుగా మారారు. ప్రస్తుతం ఆ లిస్టులోకి “మహాత్మా” మరియు “దరువు” వంటి చిత్రాలకు సంగీతం అందించిన విజయ్ అంథోని చేరనున్నారు. అలా అని ఈయన నేరుగా తెలుగు చిత్రం చెయ్యట్లేదు తమిళంలో ఈయన కథానాయకుడిగా వచ్చి అక్కడ విజయం సాదించిన “నాన్” అనే థ్రిల్లర్ చిత్రాన్ని “నకిలీ” అనే పేరుతో ఫాంటసి ఫిలిం ఫార్మర్స్ అనే సంస్థ తెలుగులోకి అనువదిస్తుంది. ఈ టైటిల్ లోగోని ప్రముఖ హీరో సూర్య ఆవిష్కరించారు. నిర్మాతలు రాజశేఖర్ మరియు చినబాబు మాట్లాడుతూ తమిళంలో విజయం సాదించిన ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయడమ చాల ఆనందంగా ఉంది అన్నారు. ఈ చిత్రం ప్రతి ఒక్కరికి థ్రిల్లింగ్ అనుభవం ఇస్తుందని రచయిత శశాంక్ వెన్నెలకంటి తెలిపారు.

Exit mobile version