విక్టరీ మధుసూదనరావు గారు ఇక లేరు


తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరో పెద్దమనిషిని కోల్పోయింది. వి.మధుధనరావు అలియాస్ విక్టరీ మధుసూదనరావు గారు ఇక లేరు. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్య సమస్యలతో పోరాడుతూ నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచారు.

ఆయన వయస్సు 89 సంవత్సరాలు. ముదుసూధనరావు గారు ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ మరియు కృష్ణంరాజులతో ఎన్నో హిట్ హిట్ చిత్రాలు తీసారు. ఆయన చిత్రాలో గుడి గంటలు, రక్త సంబంధం, టాక్సీ రాముడు, మనుషులు మారాలి, ఆత్మ బలం మొదలైనవి భారీ విజయం సాధించాయి. అక్కినేని నాగార్జున హీరోగా పరిచయమైన మొదటి చిత్రం ‘విక్రమ్’కి ఆయనే దర్శకత్వం వహించారు.

అలాగే జగపతి బాబు, ఘట్టమనేని రమేష్ లను కూడా తెలుగు తెరకు ఆయనే పరిచయం చేసారు. ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి, వంశి, శివ నాగేశ్వరరావు మరియు పి.సి. రెడ్డి మొదలైన వారు కూడా ఆయన శిష్యులుగా పనిచేసారు. ముదుసూధనరావు గారు దర్శకత్వం పైనే కాకుండా స్క్రిప్ట్ మీద కూడా ఆయనకు మంచి పట్టు ఉండేది. ఆయన కథ మరియు స్క్రిప్ట్ ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు కనుకనే ఇంత పెద్ద దర్శకుడిగా ఎదిగారని అనేవారు.

123తెలుగు.కామ్ తరపున మధుసూదనరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.

Exit mobile version