గ్లోబల్ గా కొనసాగుతున్న “అల వైకుంఠపురములో” హవా..!

గ్లోబల్ గా కొనసాగుతున్న “అల వైకుంఠపురములో” హవా..!

Published on Jul 21, 2020 8:36 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “అల వైకుంఠపురములో”. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

అయితే ఈ చిత్రం ఒక సినిమాగా కంటే కూడా ఆడియో పరంగా అంతకు మించిన భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎస్ ఎస్ థమన్ అందించిన సంగీతం మరియు పాటలు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

థమన్ మరియు అతని బృందం అందించిన ఈ పాటలు ప్రపంచ వ్యాప్తంగానే దుమ్ము రేపుతున్నాయి. గత కొన్నాళ్ల క్రితమే గ్లోబల్ గా ట్రెండ్ అవుతున్న టాప్ 100 పాటలలో ఈ సినిమా పాటలు కూడా నిలిచి అరుదైన ఘనతను అందుకున్నాయి. కానీ ఆ హవా ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలోని సెన్సేషనల్ హిట్ ట్రాక్ “బుట్ట బొమ్మ” సాంగ్ రీసెంట్ గ్లోబల్ మ్యూజిక్ వీడియోస్ లో 17వ స్థానం అలాగే మరో హిట్ ట్రాక్ “రాములో రాముల” 94వ స్థానంలో నిలిచినట్టు తెలుస్తుంది. ఇలా గ్లోబల్ వైడ్ గా మన తెలుగు నుంచీ ఇవే నిలిచి హవా కొనసాగించడం విశేషం.

తాజా వార్తలు