వరుణ్ సందేశ్ – కోమల్ ఝా మధ్య మాటల యుద్ధం

Varun-Sandesh-and-Komal-Jha

వరుణ్ సందేశ్ – కోమల్ ఝా జంటగా నటించిన సినిమా ‘ప్రియతమా నీవచట కుశలమా’. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోందని ఫిల్మ్ నగర్లో అనుకుంటున్నారు. కానీ ఈ వివాదం ఇప్పుడు బయటకి వచ్చేసింది. ఒక ప్రముఖ దిన పత్రికతో మాట్లాడుతూ కోమల్ ఝా వరుణ్ సందేశ్ పై వివాదాస్పద కామెంట్స్ చేసింది. ‘సినిమా పోస్టర్ పై వరుణ్ సందేశ్ నన్ను తిసేయించారు. ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంచాడు. సినిమాలో నా పాత్రని కూడా చాలా వరకు కట్ చేయించాడు. ఇదంతా అతను అడిగిన వాటిని కాదన్నందుకే అలా చేసాడు. అలాగే షూటింగ్ టైంలో నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడని’ ఆమె తెలిపింది.
వరుణ్ సందేశ్ ఆమె చేసిన ఆరోపణలను కొట్టిపారేశాడు. ‘ ఆమె నా గురించి ఎందుకలా మాట్లాడుతుందో నాకు తెలియదు. ఈ సినిమా విషయంలో నేనొక్కడినే ప్రచారం చేయడమనేది నాకు సంతోషాన్ని ఇవ్వదని’ అన్నాడు. ముందు ముందు ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

Exit mobile version