మేము ముందుగా తెలిపినట్టే ఈ 2014 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ టాలీవుడ్ నటులకు వరంగా మారనుంది. ఎంతోమంది సినిమా ప్రముఖులు నేరుగానో లేక వేరే విధంగానో ఎన్నికలలో తమ ఉనికిని చాటుకోవడానికి సిద్ధపడ్డారు. ఈ జాబితాలోకి ఇప్పుడు చేరిన మరో వ్యక్తి వేణు మాధవ్
ఈ పాపులర్ కమెడియన్ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చే ఎన్నికలలో తనకు టికెట్ ఇమ్మని అభ్యర్ధించారు. పార్టీతో తనకు 20ఏళ్ళుగా మంచి సంబంధం వుందని, దాని వలనే టికెట్ ఆశిస్తున్నా అని చెప్పుకొచ్చారు
ఈ నటుడుకి నల్గొండ ఏరియా నుండి పాల్గొనాలని కోరికట. ఇప్పటివరకూ టి.డి.పి ఎటువంటి అధికారిక ప్రకటనా ఇవ్వలేదు. మరి మన వేణు కోరిక తీరాలని ఆశిద్దాం