రాంగోపాల్ వర్మగా కనిపించనున్న వెన్నెల కిషోర్

తన రాబోతున్న చిత్రంలో వెన్నెల కిషోర్, రామ్ గోపాల్ వర్మగా కనిపించనున్నారు నమ్మలేకపోతున్నారా? ఖాజా రాబోతున్న చిత్రం “D /O రామ్ గోపాల్ వర్మ” అనే చితంలో రామ్ గోపాల్ వర్మ అనే సెలెబ్రిటి పాత్రలో కనిపించనున్నారు. ఒక సెలెబ్రిటి మరియు అతని కూతురికి మధ్యన ఉన్న బంధం గురించి ఈ చిత్రం రానుంది. ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది నవంబర్ 20న ఆడియో విడుదల జరుపుకోనుంది. నవీన జాక్సన్ మరియు కవిత అరస్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఖాజా నాటకాల రచయిత గతంలో 9 నంది అవార్డ్లను గెలుచుకున్నారు ఇది అయన దర్శకత్వం వహిస్తున్న మొదటి చిత్రం. ఫర్ ఎవర్ ఫెంటాస్టిక్ ఫిలిమ్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. పి జి విందా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఆదేశ్ రవి సంగీతం అందించారు ఈ చిత్రాన్ని నవంబర్ 30న విడుదల చెయ్యాలని ఖజ సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version