వెన్నెల కిషోర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం వెన్నెల 1 1/2 ఎట్టకేలకు సెప్టెంబర్ 21న విడుదల ఈ చిత్ర ఆడియో చాలా కాలం క్రితం విడుదల అయ్యింది. పలు కారణాల వలన చిత్ర విడుదల ఆలస్యమయ్యింది. దేవ్ కట్ట దర్శకత్వంలో వచ్చిన “వెన్నెల” చిత్రంలో హాస్యనటుడిగా కనిపించిన కిషోర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. “దూకుడు” చిత్ర నిర్మాతల్లో ఒక్కరయిన అనిల్ సుంకర ఈ చిత్రాన్ని కొనుక్కున్నారు. చిత్రం మరింత బాగుండటానికి ఈ చిత్రంలో చాలా మార్పులు చేశారు. చైతన్య కృష్ణ మరియు మోనాల్ గజ్జర్ లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. బ్రహ్మానందం మరియు వెన్నెల కిషోర్ లు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. చాలా భాగం వరకు చిత్రీకరణ బ్యాంకాక్ లో జరుపుకున్న ఈ చిత్రం దేవ్ కట్ట “వెన్నెల”కు సీక్వెల్. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.