ఎట్టకేలకు విడుదల కానున్న ‘వెన్నెల 1.5’

ఎట్టకేలకు విడుదల కానున్న ‘వెన్నెల 1.5’

Published on Aug 30, 2012 3:59 AM IST


పాపులర్ కామెడీ చిత్రమైన ‘వెన్నెల’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘వెన్నెల 1.5’. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెప్టెంబర్ 14న విడుదల ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘వెన్నెల’ చిత్రం ద్వారా కమెడియన్ గా తెలుగు తెరకు పరిచయమైన వెన్నెల కిషోర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చలా కాలం క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. ‘దూకుడు’ చిత్ర నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర ఈ చిత్రాన్ని కొనుక్కొని చిత్రం బాగా మంచి క్వాలిటీ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు. చైతన్య కృష్ణ మరియు మోనాల్ గజ్జర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం మరియు వెన్నెల కిషోర్ ముఖ్యమైన కామెడీ పాత్రలు పోషించారు. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

తాజా వార్తలు