నవంబర్ 14న రానున్న వెంకీ – రామ్ ల మసాల

masala-news
విక్టరీ వెంకటేష్ – ఎనర్జిటిక్ హీరో రామ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘మసాల’ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రిలీజ్ డేట్ ని ఈ చిత్ర నిర్మాత స్రవంతి రవి కిషోర్ ఖరారు చేసారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి.

‘మసాల’ బాలీవుడ్ లో బ్లాక్ బస్తర్ హిట్ గా నిలిచిన ‘బోల్ బచ్చన్’ మూవీకి రీమేక్. ఈ చిత్ర తెలుగు వెర్షన్ కోసం కొన్ని మార్పులు చేసారు. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం చెప్పిన సమాచారం ప్రకారం వెంకటేష్ పవర్ఫుల్ పాత్ర, రామ్ కామెడీ పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి బిగ్ హైలట్ అవుతుందని సమాచారం. స్రవంతి రవి కిషోర్ – సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి విజయ్ భాస్కర్ డైరెక్టర్. అంజలి, శాజన్ పదమ్సీ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

Exit mobile version