సంక్రాంతికి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’

విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటిస్తున్న మల్టి స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సంక్రాంతికి విడుదల కాబోతుంది. మొదటగా ఈ సినిమాని డిసెంబర్ 21న విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అయితే షూటింగ్ పార్ట్ ఇంకా మిగిలి ఉండటంతో డిసెంబర్ నుండి జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదటగా ఆడియో విడుదల కూడా నవంబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. అయితే సినిమా విడుదల వాయిదా పడటంతో ఆడియో విడుదల కూడా వాయిదా పడబోతుంది. సమంత, అంజలి హీరొయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Exit mobile version