విక్టరీ వెంకటేష్ మరియు ప్రిన్స్ మహేష్ బాబు హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రం “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రంలోని ముఖ్య తారాగణంపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మన తెలుగు సాంప్రదాయ విలువలు మరియు కుటుంబ విలువల గురించి చెప్పే ఒక మంచి ఫ్యామిలీ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ” సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రంలో వెంకటేష్ మరియు మహేష్ బాబులు అన్నదమ్ములుగా కనిపించనున్నారు, వీరిద్దరికీ నాన్నగారి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో సమంత మరియు అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ కాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై ‘దిల్’ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.