చాలా రోజుల తరువాత ఇద్దరు పెద్ద స్టార్స్ ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. విక్టరీ వెంకటేష్ మరియు ప్రిన్స్ మహేష్ బాబు కలిసి నటించబోతున్నారు. కొత్త బంగారు లోకం సినిమాతో
తెలుగు ప్రేక్షలకు కొత్త అనుభూతి పంచిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ దర్శకుడు తన తరువాతి చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కోసం ఈ ఇద్దరు స్టార్స్ ని ఒకే తాటి పైకి తెచ్చారు.
ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే డిసెంబరు 15న ప్రారంభం కావాల్సి ఉండగా పలు కారణాల వాళ్ళ వాయిదా పడుతూ వస్తుంది. తాజా సమాచారం ప్రకారం జనవరి 18న షూటింగ్ ప్రారంభం అవుతుంది
అని సమాచారం. వెంకటేష్-మహేష్ ఇద్దరు అన్నదమ్ములుగా ప్రకాష్ రాజ్ వారికి తండ్రిగా కనిపించబోతున్నారు. మహేష్ సరసన సమంత, వెంకటేష్ భార్యగా అమలా పాల్ నటిస్తారని
సమాచారం. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తారు.