‘గోల్ మాల్’ సినిమా కోసం పోటిపడి నటిస్తున్న వెంకటేష్, రామ్

venkatesh-and-ram-for-golma
హిందీ సూపర్ హిట్ సినిమా ‘బోల్ బచ్చన్’ కి రీమేక్ గా నిర్మిస్తున్న సినిమా ‘గోల్ మాల్’. ఈ సినిమాని మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా దర్శకుడు కె. విజయ్ భాస్కర్ ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. విక్టరి వెంకటేష్, రామ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో హాస్యాన్ని పండించడానికి ఇద్దరు పోటిపడి మరి నటిస్తున్నారని సమాచారం. అంజలి, షాజహాన్ పద్మసీ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని స్రవంతి రవి కిషోర్, సురేష్ బాబులు కలిసి నిర్మిస్తున్నారు.

Exit mobile version