‘ఎఫ్ 3’ డిసెంబర్ లో మొదలుకానుందా ?

టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో ‘ఎఫ్ 3’ చేస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా లేకపోయి ఉంటే, ఈ పాటికే బిజీ షెడ్యూల్స్ తో వరుసగా షూటింగ్ జరుపుకుంటూ ఉండేది ఈ సినిమా. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ రెడీ అవుతునట్లు తెలుస్తోంది. డిసెంబర్ 26 నుండి షూట్ స్టార్ట్ చేస్తారట. అయితే వెంకటేష్ ఆ మధ్య ‘ఎఫ్ 3’ గురించి మాట్లాడుతూ.. తన కొత్త చిత్రాలను సంక్రాంతి అనంతరమే సెట్స్ పైకి వెళ్ళతాయని వెంకీ స్పష్టం చేశారు.

కాగా వెంకీ ఎఫ్ 3 కంటే ముందు ‘నారప్ప’ సినిమా పూర్తి చేయాల్సి రావడం, వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఒక చిత్రం చేస్తుండటం.. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాకే.. ఈ హీరోలు ‘ఎఫ్ 3’ షూట్ లో పాల్గొంటారట. కాగా ఇప్పటికే అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేశారు. మరి మొదట హీరోలు లేని సీన్స్ ను ప్లాన్ చేస్తారేమో చూడాలి. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేసిన చిత్రం ‘ఎఫ్ 2’. ఈ చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది.

Exit mobile version