షాడోపై కాన్ఫిడెంట్ గా ఉన్న వెంకటేష్

షాడోపై కాన్ఫిడెంట్ గా ఉన్న వెంకటేష్

Published on Mar 16, 2013 7:09 PM IST

Shadowవిక్టరి వెంకటేష్ ఇంతకు ముందు చాలా రకాల పాత్రలను చేసి అందరి ప్రశంసలు పొందాడు. అలాగే ప్రస్తుతం వస్తున్న ‘షాడో’ సినిమా కూడా మంచి విజయాన్ని సాదిస్తుందని నమ్మకంతో వున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్ హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ కొత్తగా చూడడానికి అందంగా, స్టైలిష్ గా కనిపించనుంది. ఈ సినిమాలో తన పాత్ర గురించి, ఈ సినిమా గురించి వెంకటేష్ మాట్లాడుతూ ‘నేను ఎప్పుడు కొత్తగా ప్రయత్నాలు చేసిన ప్రజలంతా నన్ను మెచ్చుకున్నారు, ఆదరించారు. అలాగే ఈ సినిమాలో నేను చేసిన ఈ కొత్త రకమైన పాత్రని మీరు ఆదరిస్తారని నమ్ముతున్నని ‘ అన్నాడు.

ఎస్. ఎస్. థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో తాప్సీ, ఫ్యామిలి హీరో శ్రీకాంత్, మధురిమలు నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా సమ్మర్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు