‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కోసం అహోబిలం వెళ్ళిన వెంకటేష్

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కోసం అహోబిలం వెళ్ళిన వెంకటేష్

Published on Jul 4, 2012 3:44 AM IST


టాలీవుడ్లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రం ” సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”. జూలై 4 నుంచి తెరకెక్కించబోయే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం విక్టరీ వెంకటేష్ మరియు అంజలి అహోబిలం వెళ్లారు. ఈ చిత్రం అహోబిలంలో 3 – 4 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ చిత్రీకరణలో మహేష్ బాబు పాల్గొనటం లేదు. సెప్టెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్ర చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడీగా అందాల భామ సమంత కనిపించనుంది, అలాగే వెంకటేష్ కి జోడీగా అంజలి కనిపించనుంది. శ్రీ కాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు