వెంకటేష్-నయనతార ‘రాధ’ కోసం మరోసారి జోడీ కట్టనున్నారా?

venkatesh-and-nayantara

ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్న తాజా సమాచారం ప్రకారం విక్టరీ వెంకేష్ హీరోగా త్వరలోనే ‘రాధ’ అనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాకి డైరెక్టర్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన చర్చలు చివరి దశలో ఉన్నాయని సమాచారం.

ఈ సినిమాలో వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్ గా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా మూహుర్త కార్యక్రమాలు 2014 సంక్రాంతికి జరిగే అవకాశం ఉంది. డివివి దానయ్య ఈ సినిమాని నిర్మించనున్నారు. వెంకటేష్ ప్రస్తుతం ‘మసాల’ సినిమాతో బిజీగా ఉంటే, మారుతి ‘కొత్త జంట’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ ‘రాధ’ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేసే అవకాశం ఉంది.

Exit mobile version