తమిళనాడులో విడుదలకానున్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్స్

venkatadri-express

సందీప్ కిషన్ నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్స్’ సినిమా తమిళనాడులో కొన్ని చోట్ల ప్రదర్శితం కానుంది. సందీప్ కెరీర్ లోనే తొలిసారిగా తన సినిమా ఒకే రోజు ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులో విడుదలకానుంది

‘పిజ్జా’ సినిమాను పంపిణీ చేసిన కాఫీస్ సినిమా బ్యానర్ తమిళనాడులో ఈ సినిమాను విడుదలచేయనున్నారు. చెన్నైలో ఈ సినిమా ప్రచారం భారీ రీతిలో సాగనుంది. సందీప్ ‘యారుడా మహేష్’ అనే సినిమాలో, ‘గుండెల్లో గోదారి’ తమిళ వెర్షన్ లో నటించాడు. అయతే ఇప్పుడు సందీప్ కెరీర్ లోనే భారీ సినిమా అయిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్స్ కోసం చాలానే కష్టపడుతున్నాడు

ఈ సినిమాలో రాకుల్ ప్రీత్ హీరోయిన్. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై కిరణ్ నిర్మిస్తున్నాడు. రమణ గోగుల సంగీత దర్శకుడు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్. నవంబర్ 29న ఈ సినిమా విడుదలకానుంది.

Exit mobile version