“వీరమల్లు” నుంచి అప్డేట్ వచ్చేస్తుంది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన మొదటి సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే ఇక రెండో సాంగ్ కోసం అంతా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఈ సాంగ్ పై నేడే క్లారిటీ రానున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ఈ రెండో సాంగ్ పై మేకర్స్ నేడు క్లారిటీ ఇవ్వనున్నారట. అలాగే దీనిపై నిధి అగర్వాల్ కూడా టీజ్ చేయడంతో ఇదో డ్యూయెట్ సాంగ్ కూడా కావచ్చని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే మెగాసూర్య ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version