సిద్దార్థ్ సరసన వేదిక?

Siddharth-and-Vedika
‘ముని’, ‘బాణం’, ‘దగ్గరగా దూరంగా’ సినిమాలతో తెలుగు వారికి పరిచయమున్న వేదిక సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న ద్వి బాషా చిత్రంలో చాన్స్ కొట్టేసింది. 1920లలో జరిగే ఈ పీరియడ్ మూవీకి వసంతబాలన్ డైరెక్టర్. తమిళంలో ‘కావియా తలైవన్’ పేరుతో రానున్న ఈ సినిమాకి తెలుగు టైటిల్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. వేదిక చివరిగా బాల తీసిన ‘పరదేశి’ సినిమాలో నటించి తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది.

ఈ సినిమా ఒకప్పటి స్టేజ్ ఆర్టిస్టులు, సింగర్స్ అయిన ఎస్.జి కిట్టప్ప, కెబి సుందరంబాల్ లను స్పూర్తిగా తీసుకొని ఈ సినిమాని తీస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా అనైక ఎంపికైంది. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి నిరావ్ షా సినిమాటోగ్రాఫర్. ఈ సినిమా షూటింగ్ జూలై లో మొదలవుతుంది.

Exit mobile version