మెగాస్టార్ చిరంజీవి చేయనున్న సినిమాల్లో మెహర్ రమేష్ సినిమా కూడ ఒకటి. ఇది తమిళ సూపర్ హిట్ చిత్రం ‘వేదాళం’కు తెలుగు రీమేక్. కొరటాల శివ ‘ఆచార్య’ పూర్తయ్యాక ఈ సినిమానే చిరు చేయనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. మెహర్ రమేష్ నటీనటుల్ని వెతికే పనిలో ఉన్నారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాను 2021 సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చిరు భావిస్తున్నారని, ఈమేరకు దర్శకుడికి చిత్రీకరణకు సిద్ధంకమ్మని చెప్పేశారని తెలుస్తోంది.
ఇప్పటికే సినిమాలో చిరు చెల్లెలి పాత్ర కోసం స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఫైనల్ కాగా ప్రతినాయకుడి పాత్ర కోసం బాలీవుడ్ నటుడిని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది దసరా నాటికి సినిమాను విడుదలచేయాలని ప్లాన్ చేస్తున్నారట. ‘వేదాళం’ ఒరిజినల్ స్క్రిప్ట్ మీద చాలా నెలలు పనిచేసిన మెహర్ రమేష్ ఆ కథను తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్చి పక్కాగా తయారుచేసుకున్నారట. మెహర్ రమేష్ సినిమా చేసి చాలా ఏళ్లే అయినా ఆయన కథను తయారుచేసుకున్న విధానం నచ్చి నమ్మకం కుదరడంతో ఆయనతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. ఇకపోతే ఈ నెల 9 నుండి ‘ఆచార్య’ షూటింగ్ రీస్టార్ట్ చేయనున్నారు మెగాస్టార్.