VD14.. ఊరించి ఉసూరుమనిపించారు..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ జూలై 31న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే, ఈ సినిమా రిలీజ్ కాకముందే, విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

‘టాక్సీవాలా’ ఫేం డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు విజయ్ దేవరకొండ సిద్ధమయ్యాడు. విజయ్ కెరీర్‌లో 14వ చిత్రంగా ఈ మూవీ రానుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జూలై 10న ఉదయం 11.09 గంటలకు చేస్తున్నట్లు మేకర్స్ తొలుత ప్రకటించారు. అయితే, కొద్దిసేపటి క్రితం ఈ పూజా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు వారు తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పూజా కార్యక్రమం వాయిదా వేయక తప్పడం లేదని వారు తెలిపారు.

దీంతో VD14 ప్రాజెక్ట్‌పై ఇలా ఊరించి అలా ఉసూరుమనిపించారు.. అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్ర పూజా కార్యక్రమానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలో వెల్లడిస్తామని వారు తెలిపారు.

Exit mobile version