త్వరలో ప్రారంభంకానున్న వరుణ్ తేజ్ కొత్త సినిమా

varun-tej
మెగా ఫ్యామిలీలో అగ్ర నటుల ఆశీర్వాదంతో ఈ ఏడాది హీరోగా లాంచ్ అవ్వనున్నాడు మన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. ఈ సినిమా నల్లమలపు బుజ్జి, టాగూర్ మధు నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటుంది

ఈ సినిమా షూటింగ్ మార్చ్ 24నుండి కొచ్చిన్ లో జరుపుకోనుంది. పూజ హేగ్దే హీరోయిన్. శ్రీకాంత్ పూర్వపు సినిమాలలో లానే ఈ చిత్రంలో కూడా హృదయానికి హత్తుకునే సన్నివేశాలే కాక, రోమాన్స్ కూడా వుంటుందని చెప్పవచ్చు. ఈ సినిమాలో అధిక భాగాన్ని హైదరాబాద్, అలెప్పీ, కొచ్చిన్, నాగర్సోల్ మరియు అమలాపురం ఏరియాలలో తీయనున్నారు

మిక్కి జె మేయర్ సంగీత దర్శకుడు. వి మకరందన్ సినిమాటోగ్రాఫర్. ఈ ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు

Exit mobile version