మెగా ఫ్యామిలీ నుంచి త్వరలోమరో మెగా హీరో త్వరలో తెలుగు వారికి పరిచయం కానున్నాడు. అతనే నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ హీరోగా పరిచయమవుతూ శ్రీ కాంత్ అడ్డాల డైరెక్షన్ లో చేయనున్న సినిమాని ఇటీవలే లాంచనంగా ప్రారంభించారు.
ఈ సినిమా రెగ్యలర్ షూటింగ్ రేపటి నుంచి కేరళలోని కొచ్చిన్ లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ చిత్ర టీం అంతా అక్కడి చేరుకుంది. మొదటి రోజు షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని వరుణ్ తేజ్ ట్వీట్ కూడా చేసాడు. శ్రీ కాంత అడ్డాల గత సినిమాల్లాగానే ఫమిల్య్ అంతా చూడదగ్గ విధంగా ఉండబోయే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో వరుణ్ తేజ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. నల్లమలపు శ్రీనివాస్ – ఠాగూర్ మధు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించనున్నాడు.