వరుణ్ తేజ్ – క్రిష్ మూవీ ఆగిపోయిందా?

Varun-Tej_krish_film
మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ తన మొదటి సినిమా కోసం ఎంతో ఎదురుచూస్తున్నాడు. ఈ యంగ్ హీరో తన మొదటి సినిమా శ్రీ కాంత్ అడ్డాలతో చెయ్యాలి కానీ అది ఆగిపోయి మొదటి సినిమా బాధ్యత పూరి జగన్నాథ్ మీదకి వెళ్ళింది. కొద్ది రోజులు స్క్రిప్ట్ వర్క్ జరిగాక ఆగిపోయింది. ఆ తర్వాత ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ఫేం క్రిష్ కి ఆ అవకాశం దక్కింది.

ఈ సినిమా ఈ నెల నుంచి సెట్స్ పైకి వెళ్ళాలి కానీ ఇప్పటి వరకు ప్రొడక్షన్ టీం నుంచి ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. ఇండస్ట్రీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాము.వరుణ్ తేజ్ మళ్ళీ శ్రీ కాంత్ అడ్డాల దర్శకత్వంలో చేసే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఈ టాల్ అండ్ హన్డ్సం హీరో మొదటి సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. చూద్దాం ఎం జరుగుతుందో..

Exit mobile version