పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ఓజి కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించగా ఇందులో పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్‌తో బాక్సాఫీస్‌ను తగలబెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమాలోని మరో పవర్ఫుల్ పాత్ర అర్జున్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాలో అర్జున్ అనే పాత్రలో అర్జున్ దాస్ నటిస్తున్నాడు. పవర్ఫుల్ లుక్స్‌తో కిక్ బాక్సింగ్ చేస్తున్న అర్జున్ దాస్ లుక్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తోంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటిస్తుండగా అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.