‘హ్యాపీ డేస్ ‘ చిత్రం తో కెరీర్ ప్రారంభించిన వరుణ్ సందేశ్ కెరీర్ ప్రస్తుతం నీరసంగా సాగుతుంది . ఈ ఏడాది అతను నటించిన ఏ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర విజయవంతం కాలేదు.
ప్రస్తుతం నిర్మాణంలో వున్న పలు చిత్రాల్లో నటిస్తున్నాడు . వాటిలో ఒక చిత్రం ‘నాతో వస్తావా ‘ ఈ చిత్రం ఇటివలే వైజాగ్ లో రెండో షెడ్యూల్ ని ముగించుకుంది . నవంబర్ 18 న తదుపరి షెడ్యూల్ చెన్నై లో మొదలు కానుంది. ఈ చిత్రం కన్నడ,తెలుగు మరియు తమిళ్ బాషలలో విడుదల కానుంది . ఆడియో జనవరి లో విడుదల కానుండగా చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 న విడుదల చెయ్యనున్నారు .
బార్బీ చోప్రా హీరోయిన్ గ నటిస్తున్న ఈ చిత్రానికి చక్రి సంగీతం అందిస్తున్నారు. రవి రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు . అజయ్ సూర్య మరియు మని కుమార్ సంయుక్తంగ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న్నారు.