వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న ‘ప్రియతమా నీవచట కుశలమా’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో వరుణ్ సందేశ్ సరసన హసిక, కోమల్ ఝా హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా ఎక్కువ భాగం రాజమండ్రి, విజయవాడ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఫిబ్రవరి 4 తో ముగిసింది. ఇటీవలే వరుణ్ సందేశ్ – హసిక పై చివరి పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేసారు. ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాని డైరెక్ట్ చేసిన త్రినాధ రావు ఈ సినిమాకి డైరెక్టర్. జె. సాంబశివ రావు నిర్మించిన ఈ సినిమా ఆడియోని ఫిబ్రవరి 20న రిలీజ్ చేయనున్నారు.