ఆడియన్స్ కే షాక్ ఇచ్చిన వర్మ !

ఆడియన్స్ కే షాక్ ఇచ్చిన వర్మ !

Published on Jul 18, 2020 8:43 PM IST

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొద్దిరోజుల క్రితం పవర్ స్టార్ అనే టైటిల్ తో ఓ చిత్రం ప్రకటించారు. ఇప్పుడు ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ పోస్టర్ వదులుతూ ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు. ట్రైలర్ చూడాలంటే 25 రూపాయిలు పెట్టి చూడాలట. ప్రజల వీక్ నెస్ ను డబ్బులు చేసుకోవడంలో వర్మ అస్సలు మొహమాట పడట్లేదు.

ఇక ఆ మూవీలోని హీరోకి ఎవరైనా స్టార్ హీరో పోలికలు ఉంటే అది కేవలం యాదృచ్చికం మాత్రమే అని సెటైర్ వేస్తోన్న వర్మ, పవర్ స్టార్ మూవీ ట్రైలర్ పోస్టర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. కొన్నాళ్లుగా వివాదాన్నే పెట్టుబడిగా సినిమాలు తీస్తున్న దర్శకుడు వర్మ, పవర్ స్టార్ మూవీతో మరిన్ని వివాదాలు రేపడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇక పవర్ స్టార్ మూవీ ఆర్ జి వి వరల్డ్ థియేటర్ లో విడుదల కానుంది.మర్డర్, వైరస్, 12 ఓ క్లాక్ మరియు థ్రిల్లర్ అనే మరో నాలుగు సినిమాలు ఆయన తెరకెక్కిస్తున్నాడు.

తాజా వార్తలు