శివాజి సినిమాకు సరికొత్త టైటిల్

Buchadamma-Buchadu-Logo-Lau
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ అడపాదడపా హీరో పాత్రలు పోషిస్తున్న నటుడు శివాజీ. శివాజి ప్రస్తుతం ‘బూచాడమ్మా బూచాడు’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా పేరే కాక పోస్టర్ లు కూడా వైవిధ్యంగా వున్నాయి. ఈ సినిమా షూటింగ్ ముగిసింది. చిత్రబృందం ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. రొమాంటిక్ కామెడి ఎంటెర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘రాగిని ఎం.ఎం.ఎస్’ సినిమాలో నటించిన కైనాజ్ తెలుగు తెరకు పరిచయంకానుంది

రేవన్ యాధు దర్శకుడిగా పరిచయంకానున్నాడు. రాజ్ భాస్కర్ సంగీత దర్శకుడు. రమేశ్ అన్నం రెడ్డి- ప్రసాద్ రెడ్డి సంయుక్త నిర్మాతలు

Exit mobile version