టాలీవుడ్లో మెరవనున్న తమిళ స్టార్ కుమార్తె

Varalakshmi
మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల వారసులుగా కొడుకులు రావడం మామూలు విషయమే. కానీ ప్రస్తుతం హీరో, హీరోయిన్ల కుమార్తెలు హీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు. ఈ కొత్త ఒరవడికి మొదటగా బాలీవుడ్ నాంది పలికినా ఇప్పుడిప్పుడే సౌత్ ఇండియన్ సినిమాలో ఊపందుకుంటోంది. అందులో భాగంగానే డా. మోహన్బాబు వారసురాలిగా లక్ష్మీ మంచు, కమల్ వారసురాలిగా శ్రుతి హాసన్, రాధ వారసులిగా కార్తీక, తులసి, అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఇలా మొదలైన మంది ఇందాస్త్రీలోకి అడుగుపెట్టారు.

అదే కోవలో తెలుగులో ‘గ్యాంగ్ లీడర్’, ‘బన్ని’, ‘కాంచన’ చిత్రాల్లో నటించిన శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి టాలీవుడ్ కి పరిచయం కానుంది. ఇప్పటికే తమిళంలో శింబు సరసన నటించిన ఈ భామ త్వరలోనే తెలుగులో అల్లరి నరేష్ సరసన నటించనుంది. అనిల్ సుంకర నిర్మించనున్న ఈ సినిమా ద్వారా శ్రీను వైట్ల శిష్యుడు సాయి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ప్రస్తుతం అనిల్ సుంకర దర్శక నిర్మాతగా అల్లరి నరేష్ తో ‘యాక్షన్ 3డి’ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version