“వకీల్ సాబ్” ఆఫ్ స్క్రీన్ లుక్స్ అదిరాయే.!

“వకీల్ సాబ్” ఆఫ్ స్క్రీన్ లుక్స్ అదిరాయే.!

Published on Nov 5, 2020 9:51 AM IST

లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాలూకా ఫ్రెష్ లుక్స్ బయటకొచ్చి ఓ రేంజ్ లో వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇటీవలే పునః ప్రారంభించిన “వకీల్ సాబ్” షూట్ కు ప్రిపేర్ చేసిన లుక్ కు సంబంధించి మొదటి రోజు రెండు ఫోటోలు వస్తే వాటిని చూసి పవన్ అభిమానులు మెస్మరైజ్ అయ్యారు.ఇక ఆ తర్వాత వకీల్ సాబ్ కు చెందిన లాయర్ లుక్ లో పవన్ తో పలువురు సెలెబ్రెటీలు తీసుకున్న కొన్ని ఫోటోలు సినీ వర్గాల్లో వైరల్ అయ్యాయి.

ఇక ఇప్పుడు కొన్ని ఆఫ్ స్క్రీన్ లుక్స్ బయటకొచ్చాయి. ఇవి కూడా మామూలుగా లేవని చెప్పాలి. నిర్మాత దిల్ రాజుతో కలిసి హైదరాబాద్ మెట్రో వద్ద షూటింగ్ నిమిత్తం కనిపించిన పవర్ స్టార్ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో యిట్టె వైరల్ అవుతున్నాయి. దీనితో పవన్ అభిమానులు ఈ సరికొత్త ఫోటోలు చూసి ఆఫ్ స్క్రీన్ లో పవన్ యాటిట్యూడ్ మరియు స్టైలిష్ లుక్ కోసం చర్చించుకుంటున్నారు.

తాజా వార్తలు