పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం వకీల్ సాబ్. మే నెలలో ఈ మూవీ గ్రాండ్ గా విడుదల అవ్వాల్సివుంది. ఐతే అనుకున్న ప్రకారం వకీల్ సాబ్ థియేటర్స్ లో దిగే పరిస్థితి కనిపించడం లేదు. వకీల్ సాబ్ మూవీ విడుదల మే నుండి వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితులే దీనికి కారణం. ఈనెల 31వరకు కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టే క్రమంలో సినిమా షూటింగ్స్ రద్దు చేయడం జరిగింది.
కాబట్టి అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తి కాదు. అలాగే వకీల్ సాబ్ లో పవన్ హీరోయిన్ ని ఇంకా నిర్ణయించలేదని తెలుస్తుంది. పవన్ కి హీరోయిన్ కి కొన్ని సన్నివేశాలు ఓ పాట చిత్రీకరించాల్సివుంది. ఒక వేళా ఏప్రిల్ లో సినిమా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసినా కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోతేనే సినిమా విడుదల ఉంటుంది. కావున పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ మేలో విడుదల కావడం కష్టం అంటున్నారు.