“వకీల్ సాబ్” జాతర సిద్దం అవుతుందా?

“వకీల్ సాబ్” జాతర సిద్దం అవుతుందా?

Published on Nov 3, 2020 12:00 PM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పవన్ నుంచి రాబోతున్న చిత్రమిది దీనితో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా తెలుగులో ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్నారు. తెలుగు నేటివిటీకి పవన్ అభిమానుల అభిరుచికి తగ్గకుండానే మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ సినిమా నుంచి ఒక సరైన అప్డేట్ కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఒక పాట మోషన్ పోస్టర్ టీజర్ రాగా వాటికి భారీ స్థాయి రెస్పాన్స్ వచ్చింది. ఇక దీనితో అందరి కళ్ళు టీజర్ మీద పడ్డాయి. ఇది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం వకీల్ సాబ్ టీజర్ పనులు స్టార్ట్ అయ్యాయని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు పవన్ పాల్గొన్న షూట్ తో పాటుగా టీజర్ కట్ కు డబ్బింగ్ కూడా చెబుతున్నారట. మరి ఇదే కనుక నిజం అయితే యూట్యూబ్ లో చాన్నాళ్లకు పవన్ జాతర మొదలయినట్టే అని చెప్పాలి. ఈ చిత్రంలో శృతి హాసన్, నివేతా థామస్, అంజలిలు కీలక పాత్రల్లో కనిపిస్తుండగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు