ఉయ్యాలా జంపాలాకి మంచి ఓపెనింగ్స్

Uyyala-Jampala
అందమైన పల్లెటూరి స్వచ్చమైన ప్రేమకథగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘ఉయ్యాలా జంపాలా’. ఈ సినిమాకి ఏ సెంటర్స్, మల్టీ ప్లెక్స్ లో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమాకి ముందే వచ్చిన క్రేజ్ మరియు ఈ రోజు పబ్లిక్ సెలవు కావడం వల్ల ఈ సినిమాకి ఇంకా హెల్ప్ అయ్యింది. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ వారు ఎక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ చేయడం వల్ల కలెక్షన్స్ పరంగా కూడా హెల్ప్ అయ్యింది.

చిన్నారి పెళ్లి కూతురు ఫేం అవిక గోర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ద్వారా రాజ్ తరుణ్ హీరోగా పరిచయమయ్యాడు. పునర్నవి సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. విరించి వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి సన్నీ ఎంఆర్ మ్యూజిక్ అందించాడు. చాలా చిన్న బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలనే తెచ్చి పట్టింది. డి. సురేష్ బాబు సమర్పణలో సన్ షైన్ సినిమాస్ – అన్నపూర్ణ స్టూడియోస్ వారు కలిసి ఈ సినిమాని నిర్మించారు.

Exit mobile version