‘సుడిగాడు’ థియేటర్ ముందు బారులు తీరిన జనం

‘సుడిగాడు’ థియేటర్ ముందు బారులు తీరిన జనం

Published on Aug 24, 2012 9:09 AM IST


అల్లరి నరేష్ ‘సుడిగాడు’ చిత్రం మొదటి రోజే బాక్స్ ఆఫీసు దగ్గర మంచి ప్రారంభాన్ని అందుకుంది. విడుదలకి ముందే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం, అలాగే ఈ చిత్రం కోసం చేసిన ప్రమోషన్స్ మరియు పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని మరియు అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రానికి మార్నింగ్ షో నుంచే ఊహించని విధంగా సినిమా చూడటానికి థియేటర్ ముందు ప్రేక్షకులు బారులు తీరారు. మన రాష్ట్రంలోని ఇతర ముఖ్య ప్రాంతాల్లో కూడా ఒక పెద్ద హీరో సినిమాలాగా ప్రేక్షకులు టికెట్ల కోసం థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే ఈ రోజు మిగిలిన షో లకు టికెట్ల బుకింగ్ అయిపొయింది. అల్లరి నరేష్ కెరీర్లోనే ఏ చిత్రానికి రానంతగా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ ఫుల్ లెంగ్త్ పేరడీ సినిమానికి భీమనేని శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, చంద్రశేఖర్ డి.రెడ్డి నిర్మించారు. మోనాల్ గజ్జర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీ వసంత్ సంగీతం అందించారు.

తాజా వార్తలు