పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన భారీ చిత్రం “ఓజి”. ఈ సినిమాపై ఉన్న అంచనాలు కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ రేంజ్ హైప్ దీనిపై ఉంది. మరి ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న ఫస్ట్ సాంగ్ ఫైర్ స్ట్రాం ఈజ్ లిరికల్ వీడియోని మేకర్స్ నేడు సాయంత్రం విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
కానీ ట్విస్ట్ ఇస్తూ మధ్యాహ్నమే రిలీజ్ విడుదల చేసేసారు. మరి ఈ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. సుజీత్ టేకింగ్, పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ సాంగ్ లో అదిరిపోయాయి. ఇక థమన్ కూడా అదే రీతిలో క్రేజీ డ్యూటీ చేసాడని చెప్పాలి. టాలీవుడ్ జాన్ విక్ స్టైల్ లో తన మార్క్ బీట్స్ తో థమన్ దుమ్ము లేపాడని చెప్పాలి.
ఇక వీటితో పాటుగా మధ్యలో జాపనీస్ ర్యాప్ ఇంకో హైలైట్ అని చెప్పాలి. అంతే కాకుండా సినిమా నుంచి వచ్చిన హంగ్రీ చీతాకి ఓ స్పెషల్ వెర్షన్ ని కూడా ప్లాన్ చేయడం మరింత కేజ్రీగా ఉందని చెప్పాల్సిందే. మొత్తానికి మాత్రానికి మాత్రం ఓజి తో పవన్ కళ్యాణ్ అన్ని లెక్కలూ తేల్చేలానే ఉన్నారని చెప్పి తీరాలి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి