ప్రముఖ నిర్మాత ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘తూనీగ తూనీగ’ చిత్ర ప్రీమియర్ షో ఈ రోజు రాత్రి శ్రీకాకుళంలోని ఎస్.వి.సి థియేటర్లో ప్రదర్శించబోతున్నారు. ఈ థియేటర్ దిల్ రాజుకి సంభందించినది, దిల్ రాజు కొద్ది రోజుల క్రితం ఈ పాత సినిమా హాల్ ని కొని, దాన్ని రీమోడల్ చేసి కొత్తగా తీర్చిదిద్దారు , థియేటర్ రీమోడల్ చేసిన తర్వాత ప్రదర్శిస్తున్న మొదటి సినిమా ‘తూనీగ తూనీగ’. మాగంటి రాంజీ నిర్మించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ద్వారా సుమంత్ అశ్విన్ హీరోగా మరియు రియా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కానున్నారు
ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లాడుతూ ” ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర ఖచ్చితంగా విజయం సాదిస్తుందని మాకు నమ్మకం ఉంది. ఒక సినిమాకి కావాల్సిన మంచి కథ మరియు కథకి సరిపోయే నటీనటులు ఈ సినిమాకి బాగా కుదిరారు” అని ఆయన అన్నారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజా సంగీతం అందించారు. జూలై 20న ఈ చిత్రం రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కానుంది.