ట్రూ సూర్య ఫ్యాన్స్ చాలా ఫీలవుతున్నారు!

ట్రూ సూర్య ఫ్యాన్స్ చాలా ఫీలవుతున్నారు!

Published on Nov 12, 2020 8:00 AM IST

ఈ ఏడాది వచ్చిన కరోనా వల్ల పరిస్థితులు ఎంత వేగంగా మారిపోయాయో చూసాము. ముఖ్యంగా సినిమా పరిశ్రమపై మాత్రం చాలా దెబ్బ పడింది. దీనితో ఓటిటి ఊపందుకుంది. ఇక మన దక్షిణాది నుంచి ఇందులో ఇన్ని రోజులు పాటు చిన్న అలాగే మీడియం రేంజ్ సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. కానీ మొట్ట మొదటి సారిగా ఒక స్టార్ హీరో సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది.

అదే సూర్య నటించిన “ఆకాశం నీ హద్దురా”. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిన్న రాత్రి 10 గంటల నుంచే స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇక అక్కడ నుంచి సినిమా చూసిన వాళ్లంతా సూర్య ఇచ్చిన అవుట్ పుట్ చూసి స్టన్ అయ్యిపోయారు. దీనితో ట్రూ సూర్య ఫ్యాన్స్ మన తెలుగు మరియు తమిళ్ లో ఉన్నవాళ్లు చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే సూర్యకు ఒక సరైన కం బ్యాక్ హిట్ వస్తే చూడాలనుకుంటున్నారు.

కానీ ఇప్పుడైతే ఆ హిట్ వచ్చింది అభిమానులు దీనిని చూసి బాగా ఎమోషనల్ అవుతున్నారు కానీ ఇలాంటి కం బ్యాక్ మరియు హిట్ ఇలా మొబైల్స్ స్క్రీన్స్ ఓటిటిలో చూడాల్సింది కాదని బిగ్ స్క్రీన్ పై చూడాల్సిన సినిమా ఇదని మరింత ఎమోషనల్ అవుతున్నారు. మొత్తానికి సూర్య ఒక మంచి విజయాన్ని అందుకున్నా దానిని బిగ్ స్క్రీన్ మీద సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ మిస్సవ్వడం దురదృష్టకరం అనే చెప్పాలి.

తాజా వార్తలు