వెంకీ మామ కోసం ఫస్ట్ టైం ఈ టాలెంటెడ్ సంగీత దర్శకునితో త్రివిక్రమ్

Venkatesh and Trivikram

మన టాలీవుడ్ అందరి అభిమాన హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన “సంక్రాంతికి వస్తున్నాం”తో రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఎన్నో ఏళ్ళు తర్వాత కలిసి పని చేస్తున్నారు. మరి ఈ కలయికపై కూడా సాలిడ్ హైప్ అందరిలో ఉంది. అయితే ఈ సినిమా కోసం మరో సాలిడ్ బజ్ ఇపుడు వినిపిస్తుంది.

దీనితో ఈ చిత్రం కోసం ఓ కొత్త సంగీత దర్శకునితో వెంకీ మామ పని చేస్తున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఇది వరకు, దేవిశ్రీ ప్రసాద్ అలాగే థమన్ లతో ఎక్కువ వర్క్ చేసిన త్రివిక్రమ్ ఇపుడు యంగ్ అండ్ టాలెంటెడ్ సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ తో వర్క్ చేయనున్నారట. అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలతో మార్క్ చేసుకున్న ఈ టాలెంటెడ్ సంగీత దర్శకుడు త్రివిక్రమ్ టేస్ట్ లో ఎలాంటి సంగీతం అది కూడా వెంకీ మామకి ఎలాంటిది అందిస్తాడో చూడాలి.

Exit mobile version