సక్సెస్ఫుల్ గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న త్రిష

Trisha_rest
చెన్నై ముద్దుగుమ్మ త్రిషకి 2012 చెప్పుకోదగ్గ సంవత్సరంగా చెప్పుకోవాలి. ఇటీవలే 2012లో నెట్లో ఎక్కువగా డౌన్ లోడ్ చేసిన హీరోయిన్ గా త్రిష టాప్ లో ఉంది. ఇదిలా ఉంటె ఈ రోజు మరో విశేషాన్ని త్రిష సెలబ్రేట్ చేసుకోనుంది. ఈ రోజుటితో త్రిష ఇండస్ట్రీకి పరిచయమై 10 సంవత్సరాలు పూర్తయ్యింది. అమీర్ సుల్తాన్ డైరెక్షన్లో ‘మౌనం పెసియాదే’ సినిమాతో డిసెంబర్ 13న తెరకు పరిచయమైంది ఈ సినిమాలో తన నటనకి ప్రేక్షకుల నుండి మరియు విమర్శకుల నుండి త్రిష మంచి పేరు తెచ్చుకుంది.

ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోని త్రిష ఇప్పటి వరకూ 3 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, రెండు నంది అవార్డ్స్ మరియు ఇతర 8 అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. 2010లో ఎన్.డి.టి.వి ఇండియన్ అఫ్ ది ఇయర్ కి ఎంపికైంది. సౌత్ లో బాగా ఫాలోయింగ్ ఉంది. ‘ మీ అందరి శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు ఈ రోజుటితో ఇందాస్త్రీలోకి అడుగుపెట్టి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను అని’ త్రిష తన ఆనందాన్ని పంచుకుంది

Exit mobile version