మళ్ళీ పట్టాలెక్కనున్న త్రిష ‘రమ్’

మళ్ళీ పట్టాలెక్కనున్న త్రిష ‘రమ్’

Published on Feb 25, 2014 8:45 AM IST

Trisha
గత సంవత్సరం అందాల భామ త్రిష – విలక్షణ నిర్మాత ఎంఎస్ రాజు కాంబినేషన్ లో ‘రంభ ఊర్వశి మేనక’ యాక్షన్ ఎంటర్టైనర్ మొదలైంది. ఈ సినిమాలో త్రిషతో పాటు చార్మీ, ఇషా చావ్లా, నిఖీశా పటేల్ లు కూడా నటిస్తున్నారు. గత సంవత్సరం మిడిల్ ఈస్ట్ లోని కొన్ని లోకేషన్స్ లో విజయన్ మాస్టర్ నేతృత్వంలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను కూడా కంపోజ్ చేసారు. కానీ ఆ తర్వాత సడన్ గా సినిమా ఆగిపోయింది.

మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా మళ్ళీ పట్టాలెక్కనుంది. ఈ మూవీ సెకండాఫ్ లో కొన్ని క్లిష్టమైన పాయింట్స్ ని చెప్పనున్నారు. అవి కనెక్ట్ అయ్యేలా చెప్పాలని ఎంఎస్ రాజు, అతని టీం సెకండాఫ్ స్క్రిప్ట్ పై పనిచేస్తున్నారు. స్క్రిప్ట్ పనులు పూర్తి కాగానే సినిమా సెట్స్ పైకి వెళుతుంది.

ఈ విషయం పై త్రిష మాట్లాడుతూ ఇదొక భారీ బడ్జెట్ ఎంటర్టైనర్, త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందని చెప్పింది. ‘కాస్త కష్టతరమైన సినిమా, ఆ స్క్రిప్ట్ పై ఎంఎస్ రాజు గారు పని చేస్తున్నారని’ ట్వీట్ చేసింది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా చార్లెస్ ఏంజల్స్ ఉంటుందని ప్రేక్షకులు ఆశించవచ్చు.

తాజా వార్తలు