త్రిష మరో మహిళా ప్రాధాన్యమైన సినిమాలో కనిపించనుంది. ఇంకా పేరు ఖరారు చెయ్యని ఈ సినిమాను ఒకేసారి తెలుగు మరియు తమిళ బాషలలో తెరకెక్కిస్తున్నారు. పాండియన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పి.వి.ఆర్ రాజు హెచ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో త్రిషయే కాక పునమ్ బాజ్వా మరియు ఒవియా కనిపిస్తారు. పోసాని కృష్ణ మురళి, ధన్ రాజ్ మరియు సురేఖా వాణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈరోజు లాంచనంగా ప్రారంభమయ్యింది. . కష్టాలెన్ని ఎదురైనా వాటికి ఏమాత్రం తలొంచక కలిసి బతికే ముగ్గురు మిత్రుల జీవితకధే ఈ సినిమా కధ. ఈ సినిమా మొదటిషెడ్యూల్ ఈరోజునుండి మే 21 వరకూ జరగనుంది. ఈ చిత్రం రెండో షెడ్యూల్ వైజాగ్లో చిత్రీకరించి షూటింగ్ జూలైలో ముగిస్తారు. డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.