సెలెబ్రిటి క్రికెట్ లీగ్(సి.సి.ఎల్ 4)కు చెన్నై రైనోస్ తరుపున కొత్త ప్రచారకర్తగా త్రిష ఎన్నికయ్యింది. గత రెండు సంవత్సరాలుగా ఈమెకు ఈ ఆఫర్ వస్తున్నా డేట్లు సర్ధుబాటుకాని కారణంగా నిరాకరించింది
ఇప్పుడు ఈ వయ్యారి తన టీమ్ కు మద్ధతు ఇవ్వడానికి అంగీకరించింది. గత యేడాది శృతిహాసన్ ప్రచారం సాగించిన విషయం తెలిసినదే. హైదరాబాద్, చెన్నై, పుణె, బెంగళూరు మరియు డిల్లీలలో జరగనున్న ఈ మ్యాచులకు చెన్నై తరుపున విశాల్ సారధ్యం వహించనున్నాడు
అంతేకాక త్రిష నటించిన ‘ఎంద్రెద్రమ్ పున్నాగై’ అనే తమిళ సినిమా కూడా డిసెంబర్ 20న విడుదలై ప్రేక్షకులమెప్పును పొందుతుంది. ఈమె ‘దూకుడు’ కన్నడ రీమేక్ అయిన కన్నడ చిత్రంలో పునీత్ రాజ్ కుమార్ సరసన నటిస్తున్న విషయం తెలిసినదే