రవితేజ ఇటీవల చేసిన చిత్రం ‘డిస్కో రాజా’. విఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యొక్క కథలో 80ల బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుంది. సినిమా పెద్ద విజయం అందుకోకపోయినా ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు నచ్చాయి. అందుకే రవితేజ మరోసారి అదే స్టైల్ ఫాలో అవుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రజెంట్ గొపిచంద్ మలినేని డైరెక్షన్లో ‘క్రాక్’ చేస్తున్న ఆయన తర్వాతి సినిమాల్ని కూడా లైన్లో పెట్టే పనిలో ఉన్నారు.
వాటిలో ‘నేను లోకల్’ ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందని వినికిడి. ఇది కూడా ‘డిస్కో రాజా’ తరహాలోనే 1980ల నేపథ్యంలో నడుస్తుందని, రెట్రో ఫీల్ గట్టిగా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ కథలో అన్ని భావోద్వేగాలు ఉంటాయట. మరి పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ యేడాది ఆరంభంలో హిట్ అందుకోలేకపోయిన రవితేజ ఈసారైనా విజయం అందుకుంటారేమో చూడాలి.
అన్నట్టు ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని… సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందని సమాచారం. త్రినాథరావ్ నక్కిన గత చిత్రాలు కూడా ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి సినిమాలు మంచి ఎంటెర్టైమెంట్ తో సాగిన విషయం తెలిసిందే.