ప్రముఖ నటి శ్రియ ప్రాధాన పాత్రలో నటిస్తున్న సినిమా ’గమనం.‘ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ’గమనం‘ రానుంది. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశారు. టైలర్ లోనే కథలను పాత్రలను చాలా బాగా ఎలివేట్ చేశారు. ప్రతి కథ ఎమోషనల్ గా సాగుతూ సినిమా పై ఆసక్తిని పెంచుతోంది. ఇక శ్రియ, నిత్యా మీనన్ తో పాటు ఇంకా ఈ సినిమాలో ప్రియాంకా జవాల్కర్, శివ కందుకూరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కాగా ఈ సినిమాకు సుజనారావు దర్శకత్వం వహిస్తుండగా, ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలను అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ వి.ఎస్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తూనే , రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు లతో కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరువుకుంటుంది. ఇక ఈ సినిమాలో మరో ప్రముఖ నటి నిత్యామీనన్ క్లాసికల్ సింగర్ శైలపుత్రీ దేవి పాత్రలో నటిస్తున్నారు.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.