యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఈ పుట్టిన రోజు చాలా స్పెషల్. దాదాపు 11ఏళ్ల తరువాత తనకు మొదటి హిట్ మరియు మొదటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు రాజమౌళితో ఆయన పనిచేస్తుండగా ఆ సినిమా నుండి ఫస్ట్ లుక్ వీడియో ఆరోజు విడుదల కానుంది. దీనితో ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 20 కోసం అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక చరణ్ పుట్టిన రోజు విడుదలైన ఫస్ట్ లుక్ వీడియో సంచలనం రేపిన నేపథ్యంలో అంతకు మించి ఎన్టీఆర్ ఇంట్రో వీడియో ఉండాలని వారు భావిస్తున్నారు.
కాగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో కోసం రాజమౌళి దగ్గర మెటీరియల్ లేదని చెప్పడం జరిగింది. అలాగే లాక్ డౌన్ కారణంగా బయటికి వెళ్ళి ఏమీ షూట్ చేయలేని పరిస్థితి ఉంది అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోలో విషయం ఉంటుందా అనే డౌట్ కొడుతుంది. ఒక వేళ ఎన్టీఆర్ బర్త్ డే వీడియో సాదాసీదాగా ఉంటే ఫ్యాన్స్ అసలు ఊరుకోరు. అలా అని వీడియో విడుదల చేయకుండా ఉంటే కూడా ఫ్యాన్స్ కి ఆగ్రహం వస్తుంది. మరి ఈ క్లిస్ట పరిస్థితి నుండి రాజమౌళి ఎలా బయటపడతాడో చూడాలి.